
గంటకు రూ.700 నుంచి రూ.900
సంగారెడ్డిలో క్రికెట్ కాకుండా స్నూకర్, బ్యాడ్మింటన్ ఆడేందుకు ప్రత్యేకంగా నెట్ ప్రాక్టీస్ కేంద్రాలను నెలకొల్పారు. ఒకేసారి ఒక క్రికెట్ టీమ్ (12) మంది ఆడేందుకు వీలుగా గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. వేసవిలో ఈ ప్రాక్టీస్ కేంద్రాల్లో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కోచింగ్ ఇస్తున్నారు. క్రికెట్ ఆడుకునేవారి కోసం రాత్రివేళల్లో వెలుతురులో ప్రాక్టీస్ చేసుకునేందుకు సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ఒక జట్టుకు గంటకు రూ.700 నుంచి 900 వరకు చెల్లిస్తున్నారు.