గంజాయి విక్రేతల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతల అరెస్ట్‌

Apr 8 2025 7:07 AM | Updated on Apr 8 2025 7:43 AM

● ములుగులో ఐదుగురు, మునిపల్లిలో ఇద్దరు ● 1,040 గ్రాముల గంజాయి స్వాధీనం
జాతీయ స్థాయి శిక్షణకు ముగ్గురు విద్యార్థులు
ఇస్రో ఆధ్వర్యంలో యువికా–2025 శిక్షణ
ఆరోగ్యమే మహాభాగ్యం..

ములుగు(గజ్వేల్‌): గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి సోమవారం గజ్వేల్‌ కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు ములుగు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ములుగు మండలం కొట్యాల గ్రామ శివారులో కొందరు గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం అందింది. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాం. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన సారా నవీన్‌(21), సారా అశోక్‌(20), సారా సుధాకర్‌(23), యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోమాజిపల్లి తాండాకు చెందిన కేతావత్‌ సంజయ్‌కుమార్‌(20), మేడ్చెల్‌–మల్కాజిగిరి జిల్లా అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన కార్తీక్‌(20) గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. వెంటనే వారిని అరెస్టు చేసి 920 గ్రాముల గంజాయి, రూ.33 వేల నగదు, 2 బైక్‌లు, 4 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని గజ్వేల్‌ కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

120 గ్రాముల గంజాయి స్వాధీనం

మునిపల్లి(అందోల్‌): వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఇద్దరి నుంచి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుదేరా ఎస్‌ఐ రాజేశ్‌ నాయక్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కంకోల్‌ శివారు 65వ నంబర్‌ జాతీయ రహదారి టోల్‌ ప్లాజా సమీపంలో సోమవారం వాహనాల తనిఖీ చేస్తున్నాం. స్కూటీపై జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మహమ్మద్‌ అయూబ్‌ అలీ, షేక్‌ సమీర్‌ 120 గ్రాముల గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్‌ చేశాం. బీదర్‌లోని ఇరానీ గల్లీలో ఇర్ఫాన్‌ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ రాజేశ్‌ నాయక్‌, పోలీస్‌ సిబ్బంది ఎండీ. అనీఫ్‌, పాండు, తుకారాం, దత్తు, సునీల్‌ను కొండాపూర్‌ సీఐ వెంకటేశం అభినందించారు.

దుబ్బాక: ఇస్రో ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న యువికా–2025 శిక్షణకు దుబ్బాక మున్సిపల్‌లోని లచ్చపేట మోడల్‌ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇస్రో ఈ శిక్షణకు జనవరి నెలలో దేశ వ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 350 మంది విద్యార్థులు ఎంపిక కాగా తెలంగాణ నుంచి 12 మంది ఎంపికయ్యారు. ఇందులో లచ్చపేట మోడల్‌ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు విద్యార్థులు హర్షవర్ధన్‌, కౌశిక్‌, సుశాంత్‌ ఎంపిక కావడం విశేషం. మే నెలలో 15 రోజులపాటు ఇస్రో పరిశోధన కేంద్రంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇస్రో జాతీయ స్థాయి శిక్షణకు ఎంపికై న లచ్చపేట మోడల్‌ స్కూల్‌ విద్యార్థులను, గైడ్‌ టీచర్‌ జ్యోతిని సోమవారం ఎంఈఓ ప్రభుదాసు, ప్రిన్సిపాల్‌ సామలేటి బుచ్చిబాబు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

సిద్దిపేటకమాన్‌: ఆరోగ్యమే మహాభాగ్యమని.. ఆరోగ్యానికి మించిన సంపద ఏదీ లేదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ఆదేశాల మేరకు సిద్దిపేట కోర్టులో సోమవారం నిర్వహించిన మెడికల్‌ హెల్త్‌ క్యాంపును న్యాయమూర్తి స్వాతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారని సూచించారు. ఆహార నియమాలు పాటిస్తూ వాకింగ్‌, యోగా, వ్యాయామం చేయాలన్నారు. తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హెల్త్‌ క్యాంపులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు బీపీ, షుగర్‌, గుండె, గ్యాస్ట్రాలజీ సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు మిలింద్‌ కాంబ్లీ, చందన, తరణి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి తాటికొండ రమేశ్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌, న్యాయవాదులు పత్రి ప్రకాశ్‌, లక్ష్మీనారాయణ, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.

న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి స్వాతిరెడ్డి

గంజాయి విక్రేతల అరెస్ట్‌ 1
1/5

గంజాయి విక్రేతల అరెస్ట్‌

గంజాయి విక్రేతల అరెస్ట్‌ 2
2/5

గంజాయి విక్రేతల అరెస్ట్‌

గంజాయి విక్రేతల అరెస్ట్‌ 3
3/5

గంజాయి విక్రేతల అరెస్ట్‌

గంజాయి విక్రేతల అరెస్ట్‌ 4
4/5

గంజాయి విక్రేతల అరెస్ట్‌

గంజాయి విక్రేతల అరెస్ట్‌ 5
5/5

గంజాయి విక్రేతల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement