
శ్రీరామనవమికి నాచగిరి సిద్ధం
నేడు సీతారాముల కల్యాణం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలోని శ్రీరామాలయం శ్రీరామనవమి మహోత్సవానికి ముస్తాబైంది. శ్రీలక్ష్మీ నృసింహుని గర్భగుడి చెంతనే గుహలో శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి, ఆ పక్కనే ఆంజనేయ స్వామి కొలువుదీరారు. ఆదివారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో విశాలమైన కల్యాణ వేదికను సిద్ధం చేశారు. ఉదయం 10.30 గంటలకు జగదభిరాముని కల్యాణోత్సవం జరుగుతుంది.
శ్రీరామనవమి
ఏర్పాట్ల పరిశీలన
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సదాశివపేట(సంగారెడ్డి)/సంగారెడ్డి జోన్: శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని శ్రీరామ కళామందిరంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లను శనివారం పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు సదాశివపేట సంగారెడ్డి పట్టణాలలో ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను, శోభ యాత్ర జరిగే ప్రాంతాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఎస్పీతోపాటు డీఎస్పీ సత్తయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.
కేతకీలో హైకోర్టు జడ్జీలు
ఝరాసంగం(జహీరాబాద్): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీ సుధా, జస్టిస్ అనిల్ కుమార్ శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఆలయ నిర్వాహకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగ తం పలికారు. అనంతరం పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి భవానీచంద్ర, జహీరాబాద్ కోర్టు జడ్జి శ్రీధర్, ఆర్డీఓ రాంరెడ్డి, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ హనుమంతు, చంద్రశేఖర్ పాటిల్ పాల్గొన్నారు.
ఓడీఎఫ్ ఉద్యోగుల
సమస్యలు పరిష్కరించాలి
కంది(సంగారెడ్డి): ఓడీఎఫ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఓడీఎఫ్ ఉద్యో గులు ఈనెల 3నుంచి చేపట్టిన ఆందోళనలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జయవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ... ఉద్యోగులను రిటైర్ అయ్యేంత వరకు ప్రభుత్వ కొలువుల్లోనే కొనసాగించాలన్నారు. ఈ నెల10 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
నేడు చిన్నచల్మెడకు మంత్రి
మునిపల్లి(అందోల్): చిన్నచల్మెడలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం మధ్యా హ్నం 2 గంటలకు హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

శ్రీరామనవమికి నాచగిరి సిద్ధం

శ్రీరామనవమికి నాచగిరి సిద్ధం

శ్రీరామనవమికి నాచగిరి సిద్ధం