పరిష్కరించడంలో విఫలం
పట్టణంలో పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, రహదారుల నిర్మాణాలు, వీధి దీపాలు, ఇతర సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కాలనీల్లో చెత్త కుప్పలు, ఇండ్ల మధ్య మురుగునీరు, కచ్చా రోడ్లు, కచ్చా డ్రైనేజీల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పరిష్కరించాలి.
–నల్ల జయరాములుగౌడ్,
మాజీ కౌన్సిలర్, సదాశివపేట
చెత్తబండి రావడం లేదు
రాఘవేంద్రనగర్ కాలనీలో ఇంటింటికీ చెత్తసేకరించే బండిరావడం లేదు. ఇంట్లోనే చెత్తను సంచుల్లో నిల్వచేస్తుండటంతో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. డస్ట్‌బిన్లను ఏర్పాటు చేస్తే అందులో వేస్తాం. నిత్యం చెత్త సేకరణ వాహనం వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
–శశిమోహన్‌గౌడ్,
రాఘవేంద్రనగర్, సదాశివపేట
ఎవరూ పట్టించుకోవడం లేదు.
డబుల్ బెడ్రూం కాలనీలో సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం కాలనీకి వెళ్లే మార్గంలో మురుగునీటి నిల్వతో దుర్గంధం ఏర్పడింది. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. తరచూ నీటి సరఫరా పైప్‌లైన్ లీకేజీల కారణంగా నీటి సరఫరా నిలిచిపోతోంది.
–ప్రభాకర్, డబుల్ బెడ్రూం కాలనీ, సదాశివపేట
పరిష్కరిస్తాం
పట్టణ పరిధిలోని కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య సమస్యలు, వీధి దీపాల సమస్యలతోపాటు ఇతర ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటా. ఫిర్యాదులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.
– ఉమ, కమిషనర్ సదాశివపేట
పరిష్కరించడంలో విఫలం
పరిష్కరించడంలో విఫలం
పరిష్కరించడంలో విఫలం


