
కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్‌గ్రేడ్ చేయాలి
సిద్దిపేట పీజీ కళాశాలలో పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరసన
సిద్దిపేట ఎడ్యుకేషన్: సిద్దిపేటలోని యూనివ ర్సిటీ పీజీ కళాశాల (ఓయూ) పార్ట్ టైమ్ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న వారిని కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్‌గ్రేడ్ చేయాలని పార్ట్ టైమ్ అధ్యాపకులు అన్నారు. బుధవారం యూనివర్సిటీ పీజీ కళాశాల ఎదుట నల్ల బ్యాడ్జ్‌లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. జీవో నంబర్ 21 కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని వెంటనే సవరించాలన్నారు. శాశ్వత నియామకాల కోసం విడుదల చేసిన జీవో నంబర్ 21లోని పార్ట్‌టైమ్ అధ్యాపకుల సేవకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నత విద్యా కమిషన్ అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నెలకు రూ.50,000 కన్సాలిడేటెడ్ జీతం ఇవ్వాలన్నారు. పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరసనకు కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ రమేశ్, డాక్టర్ సౌజన్య కుమార్, డాక్టర్ ఛత్రపతి, డాక్టర్ శ్రీహరి, రాజేందర్ మద్దతు తెలుపారు. కార్యక్రమంలో కళాశాల పార్ట్‌టైమ్ అధ్యాపకులు డాక్టర్ సౌందర్య, స్వాతి, షంషాద్ అలీ, అశోక్, డాక్టర్ రత్నాకర చారి, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.