
ఎన్నాళ్లీ తిప్పలు
కుప్పలు తెప్పలు
ఇతర శాఖల దరఖాస్తుల వివరాలు
శాఖ పేరు మొత్తం పరిష్కారం పెండింగ్‌లో
దరఖాస్తులు అయినవి ఉన్నవి
రెవెన్యూ 835 317 518
మున్సిపల్ 149 0 149
ఎంపీడీఓ 89 19 70
డీఆర్‌డీఓ 36 11 25
హౌసింగ్ కార్పొరేషన్ 32 12 20
జిల్లా పంచాయతి 20 10 10
సర్వే ల్యాండ్ రికార్డ్స్ 12 6 6
పోలీస్ శాఖ 45 5 40
వైద్య ఆరోగ్యం 16 11 5
కాలుష్యం 6 2 4
ఇతరములు 226 136 90
మొత్తం 1,466 529 937
సంగారెడ్డిజోన్: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నా యే తప్ప అవి పరిష్కారానికి మాత్రం నోచుకోవడంలేదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో అధికారలు అర్జీలను స్వీకరిస్తున్నారు. వచ్చిన వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తున్నా.. మిగతావి మాత్రం పెండింగ్‌లోనే ఉండటంతో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎనిమిది నెలల్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 1,466మంది ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. అందులో 529 సమస్యలు పరిష్కరించగా.. 937 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అభాసుపాలవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక్కటీ పరిష్కారం కాలేదు..
జిల్లాలోని మున్సిపల్ పరిధిలో వచ్చిన అర్జీలు ఒకటి కూడా పరిష్కారం కాలేదని గణాంకాల బట్టి తెలుస్తుంది. అందోల్–జోగిపేట 8, అమీన్‌పూర్‌లో 84, సంగారెడ్డిలో 22, తెల్లాపూర్‌లో 17, జహీరాబాద్‌లో 11, సదాశివపేటలో 6, బొల్లారంలో ఒకటి చొప్పున అర్జీలు రాగా.. అధికారులు వీటన్నింటినీ పరిష్కారం చూపక పెండింగ్‌లోనే ఉంచారు.
వచ్చిన వారే మళ్లీ వస్తూ...
తమ సమస్యలు పరిష్కా రం కాకపోవటంతో వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా, డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవే ప్రధాన సమస్యలు
ప్రజావాణిలో సుమారు 50కి పైగా శాఖలకు సంబంధించిన అర్జీలు వస్తుంటాయి. ప్రధానంగా ధరణిలో భూ వివరాలు లేకపోవటం, పట్టాపాసు పుస్తకం లేదని, డబుల్ రిజిస్ట్రేషన్, ఉన్న భూమి కంటే ఎక్కువ గా, తక్కువగా చూపించటం, పింఛన్ ఇప్పించాలని, రైతుబంధు రావటం లేదని, ఉపాధి కల్పన, రహదారుల మరమ్మతులు, భూముల సర్వే, వేతనాలు రాకపోవటం, ఇళ్ల మంజూరు, మిషన్ భగీరథ, పౌరసరఫరాలు, పంచాయతీశాఖ, మున్సిపల్‌తోపాటు తదితర శాఖలపై ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి.
పరిష్కారం చూపని ప్రజావాణి
పెండింగ్‌లో 937 అర్జీలు
రెవెన్యూ సమస్యలే అధికం
కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు