
పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
జిన్నారం (పటాన్‌చెరు): పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంబాపూర్ సమీపంలోని తిరుమల ఆయిల్ క్యాం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేపర్ పరిశ్రమలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేపర్ మెటీరియల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యాజమాన్యం ఫైర్ ఇంజన్లు, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకో గా ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బీజేపీ కుట్రలను తిప్పికొడదాం
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం
తొగుట(దుబ్బాక): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు అనేక రకాల కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం ఆరోపించారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం నుంచి కాన్గల్ గ్రామానికి గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తోందన్నారు. ఏఐసీసీ అధ్య క్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతారని అన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. తుక్కాపూర్‌లో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని విజయవంతం చేయాలని ప్రీతం అధికారులకు సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తని ఖీ చేసి కుల ఆదాయ ధ్రువపత్రాలు త్వరగా అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం