
అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
జహీరాబాద్ టౌన్: అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర సరిహద్దులో గట్టి నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. సరిహద్దు, పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్‌లను మంగళవారం పరితోష్ పంకజ్ సందర్శించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన జహీరాబాద్‌కు వచ్చారు. జహీరాబాద్‌టౌన్ పోలీసు స్టేషన్ సందర్శించిన అనంతరం జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత కోహీర్ పీఎస్‌కు వెళ్లారు. అక్కడ పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయా లన్నారు. ఆయన వెంట డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి, జహీరాబాద్ టౌన్ సీఐ తదితరులు ఉన్నారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్