
బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలే
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: నిరుపేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం అభినందనీయమని, ఈ బియ్యం పక్కదారి పడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని నాయికోటిబస్తీ రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పేదల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: పేదల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని 3వ వార్డు, నాగల్‌గిద్ద మండలం ఎనక్‌పల్లిలో, మనూరులోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పథకాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఖేడ్ పట్టణంలోని భూమయ్యకాలనీలో రూ.40 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంత కష్టమైనా పేదల కోసం ఒక్కోదాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో సీసీరోడ్లు, మురుగుకాల్వల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
భూముల అమ్మకాన్ని
విరమించుకోవాలి
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్
నారాయణఖేడ్: హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. ఖేడ్‌లో మంగళవారం నిర్వహించిన పార్టీ డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసహరించుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేతకీలో కర్ణాటక
ఎమ్మెల్సీలు పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక మాజీమంత్రి రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్, భీమ్‌రావు పాటిల్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలే

బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలే

బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలే