చిన్నశంకరంపేట(మెదక్): అడవిలోకి వెళ్లిన మహిళపై అడవి పంది దాడి చేసిన ఘటన చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గవ్వలపల్లి తండాకు చెందిన దేవసుత్ లక్ష్మీ సోమవారం మోదుకు ఆకులను తెంపేందుకు అడవిలోకి వెళ్లింది. కొండాపూర్ రాజుల గుట్ట వద్ద ఆకులు తెంపుతున్న క్రమంలో మహిళపై అడవి పంది దాడి చేసి గాయపర్చింది. అప్రమత్తమైన మహిళ తప్పించుకొని రోడ్డుపైకి చేరింది. విషయం గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, మహిళను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
టైరు పగిలి కారు బోల్తా
ఇద్దరికి స్వల్ప గాయాలు
చిన్నకోడూరు(సిద్దిపేట): కారు బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని మల్లారం శివారులో రాజీవ్ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందిన ఎడపల్లి సాగర్ రెడ్డి, తన సోదరుడి కుమారుడు కారులో హైదరాబాద్‌లో వెళ్తున్నారు. మల్లారం శివారులో కారు టైర్ పగిలి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
ముగ్గురికి తీవ్ర గాయాలు
వట్‌పల్లి(అందోల్): టీవీఎస్ ఎక్సెల్, బైక్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం అందోలు మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామ సమీపంలో నాందేడ్– అకోలా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. అందోలు మండల పరిధిలోని రాంసాన్‌పల్లి గ్రామానికి చెందిన మన్నె గోపాల్ తన బావ నగేశ్‌తో కలిసి బైక్‌పై ఆయన స్వగ్రామమైన గడిపెద్దాపూర్ గ్రామానికి వెళ్తున్నారు. కన్‌సాన్‌పల్లి గ్రామ సమీపంలో రహదారి విశ్రాంతి భవనం వద్దకు చేరుకోగానే టేక్మాల్ మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన దిగాల అంజయ్య టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై జోగిపేటకు వస్తున్న క్రమంలో రెండు బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నగేశ్ కాలు విరుగగా, గోపాల్, అంజయ్యకు తీవ్ర గాయాలు అయ్యా యి. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో నగేశ్, గోపాల్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏడుపాయల్లో
నీట మునిగి వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం అమీరాబాద్‌కు చెందిన సిరిగోరి రాజు(24) చందానగర్‌లోని పికిల్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం ఏడుపాయలకు వచ్చాడు. మధ్యాహ్నం మంజీరా నదిలోని రెండో బ్రిడ్జి సమీపంలో ఇద్దరు వంట చేస్తుండగా, మరో ఇద్దరు స్నానం కోసం మంజీరా పాయల్లోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి రాజు మృతి చెందాడు. వీరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. తోటి స్నేహితులు స్థానికులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్ల సహాయంతో రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళపై అడవి పంది దాడి
మహిళపై అడవి పంది దాడి