అడుగంటిన నీళ్లు.. ఎండిన చేన్లు
పడిపోయిన భూగర్భ జలాలు
ట్యాంకర్లతో నీళ్లు..
చేతికొచ్చే దశలో ఎండిపోతున్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.చాలా మంది రైతులు ట్యాంకర్ల ద్వారా వేరే బోర్ల నుంచి నీళ్లు తెచ్చి పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు చెల్లిస్తున్నారు. చెరువులు, కుంటలు, ఇతర బోర్ల నుంచి, చాలా దూరం నుంచి పైపుల బెండలు వేసుకొని కంటిమీద కునుక లేకుండా రాత్రింబవళ్లు తమ పంటలకు నీళ్లు పెడుతున్నారు.
దుబ్బాక: వరి పంటలు చేతికొస్తాయనుకుంటున్న దశలోనే నీరందక ఎండిపోతుండడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు. జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా నీళ్లు అందక ఇప్పటికే 60 వేలకు పైగా ఎకరాల్లో ఎండిపోయినట్లు సమాచారం. వరితోపాటు మొక్కజొన్న, కూరగాయల పంటలు సైతం పెద్ద ఎత్తున ఎండిపోవడంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి–అక్బర్‌పేట, దౌల్తాబాద్, రాయపోల్, గజ్వేల్, నంగునూర్, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, వర్గల్ మండలాల్లో వేల ఎకరాల్లో చేతికొచ్చే దశలో బోర్లు నీళ్లు పోయకపోవడంతో ఎండిపోయాయి.
పశువులకు మేతగా..
చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండిపోవడంతో పశువులు, గొర్రెలకు మేతగా మారాయి. ఎండిపోయిన వరి పంటలను రైతులు తమ పశువులను మేపుతున్నారు. కొందరు రైతులు ఎండిన పంటను గొర్రెల కాపరులకు అమ్ముకుంటున్నారు. గొర్రెలను మేపడానికి ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.4 వేలకు ఎండిన పంట పొలాలను కొంటున్నారు. దుబ్బాక ప్రాంతంలో ఎక్కడ చూసిన ఎండిపోయిన వరి పొలాల్లో గొర్రెలు మేపుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. పంటలు ఎండిపోయి పెట్టుబడులు మీద పడి దుర్భరపరిస్థితుల్లో ఉన్న తమకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
నీరు లేక ఎండిపోతున్న వరి పంటలు
కాపాడుకునేందుకు రైతుల పడరాని పాట్లు
రూ.వేలు వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు
60 వేలకు పైగా ఎకరాల్లో నష్టం
పశువులకు మేతగా మారిన వైనం
పంటలు ఎండిపోయాయి
3 ఎకరాల మొక్కజొ న్న, 2 ఎకరాల్లో వేసిన వరి పంట నీళ్లు లేక ఎండిపోయాయి. మొదట్లో బోర్లు బాగానే నీరు పోయడంతో ముందుగానే 3 ఎకరాల్లో మొక్కజొన్న వేసిన. తీరా కంకులు వస్తున్న దశలో బోర్లలో నీరు తగ్గిపోయింది. ఉన్న వరి పంటకు కూడా నీరు పారుతలేదు. పెట్టుబడులు మీద పడే పరిస్థితి దాపురించింది. ఏం చేయాలో తోస్తలేదు. ట్యాంకర్లతో ఎన్ని తెచ్చిపోసిన ఫలితం లేదు.
– భూపతిరెడ్డి, రైతు
అడుగంటిన నీళ్లు.. ఎండిన చేన్లు
అడుగంటిన నీళ్లు.. ఎండిన చేన్లు
అడుగంటిన నీళ్లు.. ఎండిన చేన్లు


