కిలో మీటరున్నర పైపు లైన్
ఉష్కెతెప్ప వద్ద బోరు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 800 ఫీట్ల లోతు బోరు వేశా. కిలోమీరున్నర దూరంలో పొలం ఉంది. పొలానికి సాగు నీరు పైపులైన్ వేసి పారిస్తున్నాం. ఇక్కడ 5 ఎకరాలు ఉండగా రెండు పంటలకు నీరు అందుతుంది. బోరులో 500 ఫీట్లలోతు నుంచి నీళ్లు తోడి పైపులైన్‌తో నీరు పారిస్తున్నాం. పైపులైన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు అయినా పంటలు సాగు అవుతుండటంతో ఇబ్బంది లేదు.
– గాదె రాములు, రైతు పాంపల్లి
గ్రామాన్ని ఆదుకుంటుంది
ఉష్కెతెప్ప గ్రామాన్ని ఆదుకుంటుంది. నాకు కట్టకింద అర ఎకరం భూమి ఉంది. బోరు లేదు. అయినా యాసంగిలో పైనుంచి వచ్చే వర్షం నీరు, ఇతర రైతుల బోర్ల నుంచి వచ్చే నీటితోనే సాగు చేస్తా. ఇక్కడ బోరు వేస్తే నీళ్లు తప్పక వస్తాయన్న నమ్మకం ఉంది. ఉష్కెతెప్ప వద్ద బోర్లతో ఇంచుమించి ఊరిలోని ఎక్కువ భూమి సాగవుతుంది. చెరువు నీటితో సంబంధం లేకుండా బోర్లు నీళ్లు పోస్తాయి.
– నర్సింలు, రైతు పాంపల్లి
కిలో మీటరున్నర పైపు లైన్


