
ప్రజలకు చేరువలో న్యాయస్థానాలు
● పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి ● హైకోర్టు న్యాయమూర్తులు ● జహీరాబాద్‌లో అదనపు జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం
జహీరాబాద్ టౌన్: ప్రజలకు చేరువలో న్యాయస్థానాలు ఉండాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని హైకోర్టు న్యాయమూర్తులు అన్నారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన అదనపు జూనియర్ సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టీస్ శ్రీసుదా, జస్టీస్ అనిల్‌కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ నాయకులు ఇచ్చిన వినతిపత్రానికి స్పందించిన న్యాయమూర్తులు ప్రభుత్వ స్థలం లభిస్తే కోర్టులన్నీ ఒకే చోట ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ వల్లూర్ క్రాంతి మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ కోరిక మేరకు వాహనాల పార్కింగ్ స్థలం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి భవానీ చంద్ర, ఎస్పీ పరితోష్ పంకజ్, జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్, ఏజీపీ దత్తాత్రేరెడ్డి, న్యాయవాదులు పాండురంగా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నతానీయల్, గోపాలకృష్ణ, అనుషా, నరేశ్, శశికాంత్, మానెన్న, ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ దశరథ్ జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, పలు కోర్టుల న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.