
డంప్‌యార్డును పరిశీలించిన డీపీఓ
కంది(సంగారెడ్డి): మండల కేంద్రమైన కంది శివారులో గల డంప్‌యార్డును శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) సాయిబాబ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...శనివారం నుంచి జేసీబీలతో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రక్కన పేరుకు పోయిన చెత్తను ప్రస్తుతం ఉన్న షెడ్డు వద్దకు తరలించాలని సూచించారు. షెడ్డును పూర్తిస్థాయిలో వినియోగించుకుని చెత్తశుద్ధి యంత్రంతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలన్నారు. అలాగే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీయల్పీవోఅనిత, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి విద్యాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.