
స్నానానికి వెళ్లి కాలువలో పడి..
దౌల్తాబాద్ ( దుబ్బాక ) : స్నానానికి వెళ్లి ప్రమాదశాత్తు కెనాల్ కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీరామ్ ప్రేమ్‌దీప్ కథనం ప్రకారం... మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మచ్చనూరు గ్రామానికి చెందిన ఇర్బ ఎడకే (45) తన భార్య పిల్లలతో రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది కనకరాజు ఇటుక బట్టీలో కూలీ పని కోసం రెండు నెలల క్రితం వచ్చాడు. ఆదివారం ఉదయం రామాయంపేట కెనాల్ కాలువలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదశాత్తు అందులో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.