
నెత్తిన బండ
ఆదాయం ఫుల్.. వట్‌పల్లి గ్రామ పంచాయతీకి ఆదాయం దండిగా ఉన్నా గ్రామసంతలో మాత్రం వసతులేమితో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వివరాలు 9లో u
● ఒక్కో గ్యాస్ సిలిండర్ రూ.50 పెంపు ● రూ.855 నుంచిరూ.905లకు చేరిన ధర ● వినియోగదారులపైరూ.2.83కోట్ల అదనపు భారం
సంగారెడ్డి జోన్: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. కేంద్రం ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ. 50లు పెంచింది. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. ప్రస్తుతం 14.2కిలోల గ్యాస్ సిలిండర్ రూ.855 ఉండగా రూ.50లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ.905లకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 35 ఏజెన్సీలు ఉండగా గ్యాస్ కనెక్షన్లు 5.66లక్షలు పైగా ఉన్నట్లు సమాచారం. దీంతో కుటుంబాలపై ప్రతీ నెల దాదాపుగా రూ.2.83కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ పెంపు ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్‌లకు సైతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద మధ్య తరగతి కుటుంబాలకు రూ.500లకు సిలిండర్‌ను అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరను మహాలక్ష్మి లబ్ధిదారులది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద రూ.500లకు అందజేస్తున్న సిలిండర్ ధరను సైతం రూ.550లకు పెంచడంతో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఈ పెంపు వర్తింపజేస్తుందా లేదా అనే నిర్ణయం తీసుకోలేదు. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ పెంపు ప్రభావం తెలంగాణ ప్రభుత్వంపై భారీగానే పడనుంది.