
ఎండు గంజాయి, నాటు తుపాకీ పట్టివేత
ఒకరు రిమాండ్, పరారీలో మరో ఇద్దరు
జిన్నారం (పటాన్‌చెరు): ఎండు గంజాయితోపాటు నాటు తుపాకీ, రెండు బుల్లెట్‌లను పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. జిన్నారం సీఐ నయీముద్దీన్ కథనం మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన భూపేందర్ కుమార్ శర్మ (24) గుమ్మడిదల మున్సిపాలిటీ దోమడుగు గ్రామంలో పదేళ్లుగా ఉంటున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన మిథున్ ఆరేళ్లుగా దోమడుగు గ్రామంలో అద్దెకుంటూ శ్యాంపిస్తిన్ పరిశ్రమల కా ర్మికులుగా పని చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇద్దరూ కలిసి అప్పుడప్పుడూ సొంత రాష్ట్రానికి వెళ్లి ఎండు గంజాయిని తీసుకొచ్చి చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో పారిశ్రామిక వాడలో విక్రయిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో భూపేందర్ కుమార్ శర్మ సొంత రాష్ట్రానికి వెళ్లి పక్క గ్రామానికి చెందిన రోహిత్ అనే వ్యక్తి దగ్గర తపంచా నాటు తుపాకీతోపాటు రెండు గుండ్లు కొనుగోలు చేశాడు. దోమడుగు గ్రామంలో అద్దె ఇంట్లో వాటిని భద్రపరిచాడు. మిథున్ బీహార్ కు వెళ్లి ఎండు గంజాయిని తీసుకొచ్చి శర్మకు ఇవ్వగా వాటిని ఇంట్లో దాచాడు. గురువారం గుమ్మడిదల పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 930 గ్రాముల ఎండు గంజాయితోపాటు, నాటు తుపాకీ, రెండు బుల్లెట్లు గంజాయి ప్యాకింగ్ చేయడానికి వాడే వేయింగ్ మిషన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి భూపేందర్ కుమార్ శర్మను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు మిథున్, రోహిత్ పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామన్నారు.