
ఏఐతో సాంకేతిక విప్లవం
నర్సాపూర్: వారం రోజుల పాటు చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రెండు రోజుల్లో పూర్తి చేసే విధంగా సాంకేతిక విప్లవాలు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వ టీ వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) తనికెళ్ల జోగిందర్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక బీవీ రాజు ఇంజనీరింగు కాలేజీ 28వ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగిందర్ పాల్గొని మాట్లాడారు. సాంకేతిక విప్లవాలను విద్యార్థులు నేర్చుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని హితవు పలికారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆదిత్య విస్సాం మాట్లాడుతూ వసతులను వివరించారు. కాలేజీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేశ్ పాల్గొన్నారు. అనంతరం పీహెచ్‌డీ పూర్తి చేసిన ప్రొఫెసర్లను శాలువాలు, మెమోంటోలతో సన్మానించారు.