ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్
సందేహాలకు, సంతాపాలకు, నిరసనలకు, అవగాహనలకు ఒక్కో సందర్భానికి ఒక్కో రిబ్బను వాడుతుంటాం. జేబుకు ధరించి నిరసన తెలుపుతాం. కొన్ని రకాల వ్యాధులు, వాటి పేరుకంటే కూడా రిబ్బన్ సింబల్‌తోనే పాపులర్ అయ్యాయి. ఆ సింబల్ చూడగానే వ్యాధిపై అవగాహనకు వచ్చేస్తాం. రిబ్బన్లతో రకరకాల రంగులు నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలా ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఏ రంగు రిబ్బను దేన్ని సూచిస్తుందో.. మీ కోసం సాక్షి ప్రత్యేక కథనం. వెల్దుర్తి(తూప్రాన్):
అవగాహన కార్యక్రమాలకు ప్రత్యేకం
● కొన్ని వ్యాధులు రిబ్బన్ సింబల్‌తోనేపాపులర్ ● ఒక్కో రంగు ఒక్కో అంశం
నలుపు రంగు..
తమ డిమాండ్లను తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేసినప్పుడు నలుపు రంగు రిబ్బన్ ధరిస్తారు. అలాగే మృతిచెందిన వారికి సంతాప సూచకంగా నివాళి అర్పించే సమయంలోనూ వీటిని ధరిస్తారు.
ఎరుపు..
ఎయిడ్స్, రక్త క్యాన్సర్, గుండె జబ్బులు, వ్యసనం, విపత్తు, ఉపశమనం తదితర వాటిపై నిర్వహించే సమావేశాల్లో ఎరుపు రంగు రిబ్బన్‌ను ధరిస్తారు. అలాగే అత్యవసర పరిస్థితులకు దీన్ని ఉపయోగిస్తారు.
నీలి..
ఈ రిబ్బన్‌ను సుమారు 100కి పైగా సందర్భాల్లో ఉపయోగిస్తారు. మానవ అక్రమ రవాణా, బెదిరింపులకు వ్యతిరేకంగా వీటిని ఉపయోగిస్తారు. జల సంరక్షణపై అవగాహన కల్పించే సమయంలోనూ వీటిని ఇస్తారు.
ఆకుపచ్చ..
మూత్రపిండాలు, కాలేయం, అవయవదానం, సురక్షిత వాహన చోదకం తదితర వాటికి ఆకుపచ్చ రిబ్బన్‌ను ఉపయోగిస్తారు. గ్లోబల్ వార్మింగ్‌ను తెలిపే సందర్భంలోనూ దీనిని ఉపయోగిస్తారు.
పసుపు..
యుద్ధ ఖైదీలు, తప్పిపోయిన వారి కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పసుపురంగు రిబ్బన్‌ను ధరిస్తారు. ఆత్మహత్యల నివారణకు, ఎముకల క్యాన్సర్ తదితర వాటి గురించి నిర్వహించే అవగాహన సదస్సులో వీటిని ఉపయోగిస్తారు.
తెలుపు..
గర్భిణులు, మహిళలపై దాడులు జరిగినప్పుడు వాటికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో తెలుపురంగు రిబ్బన్ ధరిస్తారు. సురక్షిత మాతృత్వం, శాంతి, అహింసలను తెలుపుతూ జరిగే కార్యక్రమాల్లో వీటిని ఉపయోగిస్తారు.
18 రకాల రంగులు...
మానవ శరీరంలో వివిధ అవయవాలకు సోకిన క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు వైద్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు 18 రకాల రిబ్బన్‌లను ఉపయోగిస్తారు. క్యాన్సర్ వ్యాధి సోకడానికి కారణాలు, వాటి లక్షణాలు, ట్రీట్‌మెంట్ విధానం ముందస్తుగా తీసుకోవల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు వీటిని ధరిస్తారు.
గులాబీ..
గులాబీ రంగు రిబ్బన్ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సూచిస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు దీనిని అంతర్జాతీయ గుర్తుగా ఉపయోగిస్తారు.
ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్
ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్
ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్
ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్
ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్
ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్


