
బావ బామ్మర్దుల మృతదేహాలు లభ్యం
హత్నూర(సంగారెడ్డి): ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతైన ఇద్దరి యువకుల మృతదేహాలు శనివారం లభించాయి. పోలీసుల కథనం మేరకు.. హత్నూర మండలం బోర పట్ల గ్రామ శివారులోని భీముని చెరువులో శుక్రవారం గ్రామానికి చెందిన డప్పు నవీన్ కుమార్, కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని షాహిపేట గ్రామానికి చెందిన ప్రేమ్ కుమారు గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా మృతదేహాల కోసం మత్స్యకారులు అధికారులు భీముని చెరువు వద్ద గాలిస్తున్నారు. శనివారం ఎట్టకేలకు రెండు మృతదేహాలు లభించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరసకు బావబామ్మర్దిలిద్దరూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

బావ బామ్మర్దుల మృతదేహాలు లభ్యం