అంగన్‌వాడీ నిర్వహణ భేష్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నందికంది అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ బాగుందని శిశు, సంక్షేమ శాఖ రీజినల్ డైరెక్టర్ మోతీ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని నందికంది అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ పీడీ లలిత కుమారితో కలిసి ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారుల ప్రతిభను ఆమె పరీక్షించి వారితో కాసేపు ముచ్చటించారు. బాలల వికాసానికి అంకితభావంతో పని చేస్తున్న టీచర్ విజయలక్ష్మిని ఈ సందర్భంగా అభినందించారు. ప్రధానంగా శిశు మరణాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలకు మెడిటేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో చంద్రకళ, అంగన్‌వాడీ టీచర్లు గీత, శ్రీలత, సునీత తదితరులు పాల్గొన్నారు.
శిశు, సంక్షేమ శాఖ రీజినల్ డైరెక్టర్ మోతీ


