సత్తా చాటిన ఆణిముత్యాలు
టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ –1 ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు ప్రతిభ కనబర్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం పెట్టుకొని పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు అభ్యర్థులను అభినందించారు.
టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో హవా
● ఉమ్మడి జిల్లాలో ఆరుగురు ఎంపిక ● 26వ ర్యాంకు సాధించిన పూజ ● 41వ ర్యాంక్ సాధించిన శైలేష్ ● ముసాపేటకు చెందినప్రభాత్‌రెడ్డికి 73వ ర్యాంక్ ● 75వ ర్యాంకు సాధించిన సిద్దిపేట వాసి నర్ర అఖిల్ ● మిర్జాపూర్(బి)కు చెందినఅఖిలజారెడ్డికి 125 ర్యాంక్
కోచింగ్ తీసుకోకుండానే..
మెదక్‌జోన్ : టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందిన పూన శైలేష్ 41వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 503.500 మార్కులు వచ్చాయి. 1 నుంచి 7వ తరగతి వరకు మెదక్‌లోని శివ సాయి, 8 నుంచి 10 తరగతి వరకు అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ తూప్రాన్, ఇంటర్మీడియట్ నారాయణ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో చదివాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఈ ర్యాంకు సాధించడం విశేషం. తండ్రి పూన రవి పట్టణంలో బంగారం నగల దుకాణం నడిపిస్తాడు. ఈ సందర్భంగా శైలేష్‌ను పలువురు అభినందించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన నర్ర అఖిల్ 75వ ర్యాంక్ సాధించాడు. పట్టణానికి చెందిన నర్ర భగవాన్‌రెడ్డి, వజ్రమ్మల మొదటి కుమారుడు అఖిల్. రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారిగా నీటిపారుదల శాఖ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఏఈఈగా నియామకమయ్యారు. తాజాగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో అఖిల్ 75వ ర్యాంక్ సాధించాడు. కష్టపడి చదివితే ఏదైనా సాంధించవచ్చని అఖిల్ పేర్కొన్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదివానని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు.
సత్తా చాటిన ఆణిముత్యాలు


