
ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తాం
ఆర్టీసీ ఈడీ సోలోమన్
హుస్నాబాద్‌రూరల్: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని, ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులు సహకరించాలని ఈడీ సోలోమన్ అన్నారు. బుధవారం రాత్రి హుస్నాబాద్ బస్టాండ్ డిపోను పరిశీలించారు. బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ బస్టాండ్‌ను సందర్శించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. మహాలక్ష్మీ ప్రయాణికులకు సేవలందించడానికి ఆర్టీసీ ఉద్యోగులు ముందుంటారని చెప్పారు. హుస్నాబాద్ డిపో బస్టాండ్ అభివృద్ధి కోసం ఉద్యోగులతో సమీక్షించి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. బస్టాండ్‌లో గతంలో నిర్మించిన మూత్రశాలల ఎత్తు పెంచడం, షాపింగ్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసి ఆదాయ వనరులను పెంచుతామన్నారు. వీరి వెంట ఆర్‌ఎం రాజు, డిప్యూటీ ఆర్‌ఎం భూపతిరెడ్డి, డీఎం వెంకన్న ఉన్నారు.