సిద్దిపేటకమాన్: ప్రయాణికులకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సౌకర్యాలు అందిస్తామని సిద్దిపేట డిపో మేనేజర్ టీ.రఘు తెలిపారు. సిద్దిపేట డిపో నూతన మేనేజర్‌గా బదిలీపై వచ్చి ఆయన ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 30 ఏళ్లుగా ఆర్టీసీలో పని చేసిన అనుభవం ఉందని, భూపాలపల్లి, యాదగిరిగుట్ట, హయత్‌నగర్, కాచిగూడ డిపోల్లో మేనేజర్‌గా పని చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. సిద్దిపేట, దుబ్బాక డిపోల్లో సుమారు 500 మంది సిబ్బంది, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరి సహకారం, సమిష్టి కృష్టితో రెండు డిపోలను లాభాల బాటలో తీసుకెళ్తానన్నారు.
రూ.151 కే భద్రాద్రి తలంబ్రాలు ఇంటికి
శ్రీరామ నవమి సందర్భంగా ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకు పంపించడం జరుగుతుందని డీఎం తెలిపారు. రూ.151 డబ్బులు చెల్లిస్తే కార్గో ద్వారా ఇంటి వద్దకే తమ సిబ్బంది స్వామి వారి తలంబ్రాలు పంపిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను డిపో సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది మౌలానా, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ టీ.రఘు