సకల శుభములు కలగాలి..
కొత్త మావిచిగురు కోకిల పాటలు, ఆనందనందనం అవనితెలుగు
ఉర్వినుగాదియె
ఉత్తమపండుగ,
కొంగొత్త యాశలు కోర్కులమరువ
షడ్రుచుల్, భక్ష్యాలు చవులూరు
తెలుగింట, పంచాంగ శ్రవణమౌ
పర్వదినము
కవి కోకిలలు పాడు కమ్మని పద్యాలు, తెలుగు భాష ఘనత తేజరిల్ల
సకల జనులంత జగతిలో చల్లగాను, శాంతి సౌభాగ్య ఆరోగ్య సంపదలను
కలిగి వర్ధిల్లవలెగాక చెలువ మీర, సకల శుభములు కలుగాలి సత్వరమున
– తాడూరి అరుణాదేవి, హుస్నాబాద్


