
పురాణేతిహాసాల్లో ప్రసన్న కథాకలితార్థయుక్తి
అష్టావధాని బ్రహ్మశ్రీ గౌరిభట్ల రుక్మిణీ బాలముకుందశర్మ
సిద్దిపేట ఎడ్యుకేషన్:పురాణేతిహాసాలలో ప్రసన్న కథాకలితార్థయుక్తి కల్గి ఉందని, అభినవశుక పండిత, సమన్వయ సార్వభౌమ బిరుదాంకితులు, అష్టావధాని బ్రహ్మశ్రీ గౌరీభట్ల రుక్మిణీ బాలముకుందశర్మ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపే టలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రాచీన సాహిత్యం – కవితారీతులు అనే సదస్సులో పురాణేతిహాసాలలో ప్రసన్న కథాకలితార్థయుక్తి అనే అంశంపై బాలముకుందశర్మ ప్రసంగించారు. నన్నయ గారి కవితా లక్షణాల్లో మొదటిదైన ప్రసన్న కథాకలితార్థయుక్తి. ఈ లక్షణం నన్నయకు ముందే పురాణేతిహాసాల్లో కనిపిస్తుందని నిరూపించడం ఈ ఉపన్యాస లక్ష్యం. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, తెలుగు విభాగాధిపతి డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి, తెలుగు విభాగ అధ్యాపకులను అభినందిస్తూ ప్రాచీన సాహిత్యం పైన విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో పిట్ల దాసు, వెంకటరమణ, సంపత్, రామస్వామి, నరేశ్, నర్సింలు, శైలజ, రమణ, సాయి సురేశ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.