పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాశి ఫలాలను వివరించారు. అంతకుముందు రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్‌గడ్డ సిద్ధి వినాయక దేవాలయం, పటాన్‌చెరు పట్టణ పరిధిలోని చైతన్యనగర్ హనుమాన్ దేవాలయాలను ఎమ్మెల్యే గూడెం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాగా, ఉగాదిని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, రామచంద్ర రెడ్డి,నర్ర బిక్షపతి, శంకర్, వెంకట్ రావు కలసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని తన నివాసంలో కలసి శుభాకాంక్షలు అందజేశారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


