జగ్జీవన్‌రామ్‌ సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ సేవలు ప్రశంసనీయం

Apr 6 2025 6:52 AM | Updated on Apr 6 2025 6:52 AM

జగ్జీ

జగ్జీవన్‌రామ్‌ సేవలు ప్రశంసనీయం

సంగారెడ్డి జోన్‌: స్వతంత్ర సమరయోధుడిగానే కాకుండా స్వాతంత్య్రానంతరం భారత నిర్మాణంలో అపూర్వమైన సేవలు అందించిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రామ్‌ అని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ నిర్మలారెడ్డి, నాయకులతో కలిసి పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అత్యధిక కాలం కేబినెట్‌ మంత్రిగా కొనసాగిన ఘనత బాబు జగ్జీవన్‌ రామ్‌కే దక్కుతుందన్నారు. భారత ఉప ప్రధానమంత్రిగా, వ్యవసాయ, రక్షణ, రైల్వే మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించిన మహనీయుడన్నారు. అలాంటి మహనీయుని సేవలను స్మరించుకోవడం భవిష్యత్‌ తరాలకు గుర్తుకు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

నివాళులర్పించిన కలెక్టర్‌, ఎస్పీ

జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, మాధురి, గ్రంథాయల చైర్మన్‌ అంజయ్య, అధికారులు జగదీశ్‌, అఖిలేశ్‌రెడ్డి, రామాచారి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ

జగ్జీవన్‌రామ్‌ సేవలు ప్రశంసనీయం1
1/1

జగ్జీవన్‌రామ్‌ సేవలు ప్రశంసనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement