
రంజోల్ గ్రామంలో పీఆర్‌ఏ
పటం ద్వారా పంటల సాగుపై రైతులకు అవగాహన
జహీరాబాద్: భాగస్వామ్య గ్రామీణ అనుభవ కార్యక్రమం(పీఆర్‌ఏ)లో భాగంగా కొండాలక్ష్మణ్ ఉద్యాన కళాశాల విద్యార్థినులు మండలంలోని రంజోల్ గ్రామాన్ని సందర్శించారు. నెలరోజులుగా విద్యార్థినులు రైతుల పొలాల వద్దకు వెళ్లి సాగు మెళకువలు నేర్చుకున్నారు. సోమవారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామం రూపురేఖలను, సాగు చేసే పలు రకాల పంటల వివరాలను రంగులతో ముగ్గుల రూపంలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ కార్యాలయాలు, మందిరాలు, చర్చి, మసీదులతోపాటు పలు అంశాలను గుర్తించారు. అనంతరం పంటలసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవో ప్రదీప్‌కుమార్, రైతులు విద్యార్థినులు కాత్యాయని, మహాలక్ష్మి, వర్ష, మేఘన, సంధ్య, యామిని, యశస్విని, మాధురి, రవీనా, జ్యోతి, నవ్య, ప్రియాంక, రేచల్, సాయి లేఖన, సబిహా, స్నేహ,వర్షిత, స్వప్న, శ్రీజ, తనయ, సంస్కృతి, ఫిలోమిన, మానస, శిరీష పాల్గొన్నారు.