
పట్టుబట్టి.. కొలువులు కొట్టి
పట్టణానికి చెందిన వెంకటేశ్‌కు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
దుబ్బాక: కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవా చేయాలన్నదే తన లక్ష్యమని దుబ్బాక పట్టణానికి చెందిన గ్రూపు 1 ర్యాంకర్ బైండ్ల వెంకటేష్ సోమవారం తెలిపారు. దుబ్బాకకు చెందిన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బైండ్ల నారాయణ కుమారుడు వెంకటేశ్ గ్రూప్ 1 జనరల్ కేటగిరీలో 543 ర్యాంక్, ఎస్సీ కేటగిరీలో 31వ ర్యాంక్ సాధించాడు. ఇది వరకే గ్రూప్ 4లో ర్యాంక్ కొట్టి సంగారెడ్డి రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా గ్రూప్ 1 ఫలితాల్లో ర్యాంక్ సాధించడం విశేషం. తనకు ఆర్డీవో లేదా డీఎస్పీ ఉద్యోగం రావొచ్చని వెంకటేశ్ తెలిపారు. తన విజయంలో తల్లిదండ్రుల పాత్రనే కీలకమని, కలెక్టర్ కావడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు.