నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: జిల్లా కలెక్టర్
సంగారెడ్డిజోన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, ఎల్‌ఆర్‌ఎస్, మున్సిపల్ పన్ను వసూలు, రాజీవ్ యువ వికాసం అంశాలపై వివిధ విభాగాల అధికారులతో బుధవారం కలెక్టర్‌రేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలన్నారు.
ఘనంగా పూలే జయంతి
మహాత్మా జ్యోతి బా పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ క్రాంతి వివరించారు. భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అందించే ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండవ దశ దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. అదేవిధంగా అగ్నివీర్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కలెక్టర్ తెలిపారు.


