
శివలింగం వద్ద నాగుపాము
శివ్వంపేట(నర్సాపూర్): శివలింగం వద్ద నాగుపాము గంటపాటు పడగ విప్పి ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి బిజ్లిపూర్‌లోని హనుమాన్ ఆలయంలోకి ఆదివారం అర్థరాత్రి ప్రాంతములో నాగుపాము ప్రవేశించింది. పడగ విప్పి గంటపాటు అక్కడే ఉంది. అదే సమయంలో అటుగా వెళ్లిన గ్రామ యువకులు నవీన్, నర్సింలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడని సోమవారం ఉదయం గ్రామస్తులు శివలింగంకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
ముంపు గ్రామాల కార్మికులకు వేతనాలు చెల్లించండి
గజ్వేల్‌రూరల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఉంటున్న ముంపు గ్రామాల పంచాయతీ కార్మికుల ఖాతాలను మూసివేయడంతో నాలుగు నెలలుగా వారికి వేతనాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కార్మికుల ఖాతాలను తిరిగి పునరుద్ధరించి బకాయి వేతనాలు చెల్లించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు.
యువకుడి మృతదేహం లభ్యం
పటాన్‌చెరు టౌన్: గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌పూర్ శివారులోని మెడికల్ డివైస్ పార్క్‌లోని క్వారీ గుంతలో సోమవారం గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 22 నుంచి 27 వరకు ఉంటుందని తెలిపారు. ఛాతిపై యాదమ్మ అని పచ్చబొట్టు ఉండటాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించామని, మృతుడి బంధువులు ఉంటే అమీన్‌పూర్ పోలీసులను సంప్రదించాలన్నారు.
అమిత్‌షా వ్యాఖ్యలపై
పోతిరెడ్డిపల్లిలో నిరసన
జహీరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శిస్తూ కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం జరిపారు. అంబేడ్కర్‌ను కించపరిచేలా అమిత్‌షా వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కాంగ్రెస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, పార్టీ నాయకులు సుధీర్‌కుమార్, విష్ణు, మల్లన్న, ఏసు, రవీందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, షంషీర్, హాజీ, తుల్జారాం, తుల్జయ్య, సాయిలు, వీరారెడ్డి, బలరామ్, బాల్‌రాజ్, పరమేశ్ పాల్గొన్నారు.
సామూహిక కుంకుమార్చన
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత వైభవంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ అంటూ 125 మంది మహిళలు కుంకుమార్చన చేశారు. రాత్రి పూట సీతారామ చంద్ర స్వామిల ఉత్సవ విగ్రహాలను భక్తుల దర్శనార్థం హంస వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు.

శివలింగం వద్ద నాగుపాము

శివలింగం వద్ద నాగుపాము

శివలింగం వద్ద నాగుపాము

శివలింగం వద్ద నాగుపాము