
పట్టివేతలు... స్వాధీనాలు
కొకై న్
జహీరాబాద్ టౌన్: నిషేధిత మత్తు పదార్థం కొకై న్‌ను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేసి అతడి వద్దనుంచి 10.03 గ్రాముల కొకై న్‌ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శనివారం హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సులో తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి అనుమాన్పదంగా కనిపించాడు. అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఈ కొకై న్ బయటపడింది. నిందితుడిని ఏపీలోని కృష్ణ జిల్లా బంటు మిల్లపురం మండలం సోమకృష్ణపురం గ్రామానికి చెందిన డి.చంద్రశేఖర్(30)గా పోలీసులు గుర్తించారు.
రేషన్ బియ్యం
సంగారెడ్డి: రాష్ట్రం నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పుల్కల్ పోలీసులు పట్టుకున్నారు. చౌటకూర్ మండలం తాడ్దాన్‌పల్లి టోల్‌గేట్ వద్ద శనివారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో రెండు లారీల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ తెలిపారు.
ఎర్రరాయి
న్యాల్‌కల్(జహీరాబాద్): రాష్ట్ర సరిహద్దు వద్ద శనివారం అనుమతుల్లేకుండా ఎర్రరాయిని అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను హద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఎర్రరాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఎస్సై చల్లా రాజశేఖర్ వెల్లడించారు. అనుమతుల్లేకుండా ఎర్రరాయిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.