కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం | - | Sakshi
Sakshi News home page

కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం

Published Sat, Apr 5 2025 7:12 AM | Last Updated on Sat, Apr 5 2025 7:12 AM

కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం

కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం

ఇరుక్కుపోయిన డ్రైవర్‌.. తీవ్ర గాయాలు

తూప్రాన్‌: ముందు వెళుతున్న కంటైనర్‌ను వెనకాల నుంచి డీసీఎం ఢీకొనడంతో డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట స్టేషన్‌ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీని వెనకాల నుంచి డీసీఎం అతివేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన డీసీఎం డ్రైవర్‌ కబ్రేజ్‌ క్యాబిన్‌లోనే ఇరక్కుపోయాడు. కుడికాలు నుజ్జునుజ్జయింది. జీఎమ్మార్‌ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని బయటకు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు స్తంభించి పోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement