పారిశ్రామిక దోపిడీ | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక దోపిడీ

Published Sat, Apr 5 2025 7:15 AM | Last Updated on Sat, Apr 5 2025 7:15 AM

పారిశ్రామిక దోపిడీ

పారిశ్రామిక దోపిడీ

– పర్చా శ్రీనాథ్‌, రామచంద్రాపురం

వలస జీవుల బతుకు పోరు..

గంజాయి మత్తులో

లేబర్‌ క్యాంపులలో గంజాయి గుప్పుమంటోంది. వలస కార్మికలు కొంత మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసి రాత్రి కాగానే గంజాయి మత్తులో తూలుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మరికొంత మంది వలస కార్మికులు కష్టానికి తగిన ఫలితం రాకపోవడంతో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో గంజాయి అమ్మడానికి సిద్ధమవుతున్నారు.

దళారుల పెత్తనం

ఈ ప్రాంతంలో పరిశ్రమలు, నిర్మాణరంగం అభివృద్ధి చెందటంతో పాటు ఇటుక బట్టీలు ఎక్కువగా ఉండటంతో కార్మికులకు మంచి డిమాండ్‌ ఉంది. స్థానికులు ఎక్కువ వేతానాలను డిమాండ్‌ చేయడంతో తక్కువ వేతనాలతో పనిచేసే వలస కార్మికులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దీంతో దళారులు రాజ్యమేలుతున్నారు.

పాలకులపై కోర్టు ఆగ్రహం

వలస కూలీల దుర్భర పరిస్థితులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను 2020 మే లో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. అయినా వారి బతుకులు మారడం లేదు. తక్కువ వేతనాలకు వలసకార్మికులు ఎక్కువ పనిగంటలు ఎందుకు పనిచేయాల్సి వస్తుందో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రమాదకరమైన చోట పని చేస్తున్నా వారికి ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తోందని ప్రశ్నించగా సమాధానం చెప్పలేక అప్పటి సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనం ముందు నీళ్లునమిలారు.

గాలిలో కలుస్తున్న ప్రాణాలు

రిశ్రమలలో, నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు వారు పనిచేసే చోట సరైన భద్రత లేకపోవడంతో వారి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలలో వలస కార్మికులు మృతి చెందిన వెంటనే వారి మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించి యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయి. కొన్నిచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే నామమాత్రంగా నగదు ముట్టజెప్పి కుటుంబ సభ్యులతో రాజీపడుతున్నారని కార్మిక సంఘా నేతలు వాపోతున్నారు. ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్మికుల సమస్యలు

రిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయడం లేదు. వీరికి అన్‌స్కిల్డ్‌ వేతనం మాత్రమే ఇస్తున్నారు. 12గంటలు పని చేయిస్తున్నారు. చట్ట ప్రకారం రావలసిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించడంలేదు. ప్రమాదాలు జరిగిన పట్టించుకోవడంలేదు. ప్రమాదంలో మృతి చెందితే వారి మృతదేహాలను ఆగమేఘాల మీద స్వగ్రామాలకు తరలిస్తున్నారు.

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఉన్న ఊరిలో ఉపాధి కరువై..బుక్కెడు బువ్వ కోసం వలస కార్మికులు పడుతున్న కష్టాలు ఇక్కడ వర్ణనాతీతం. కనీస వేతనాలు లేక శ్రమకు తగిన ఫలితం రాక వారికి అండగా ఉండాల్సిన చట్టాలు అమలు కాక వలస కార్మికులు నరకయాతనకు గురవుతున్నారు. కుటుంబ పోషణ కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న వలస కార్మికులు తిరిగి ఇంటికి ప్రాణాలతో వెళ్తామన్న నమ్మకం కూడా వారిలో లేకపోవడంతో చూస్తే వారి జీవితాలు ఎంత దుర్భంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. వలస కార్మికుల కుటుంబాలలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. ఇన్ని జరుగుతున్నా పాలకులు మాత్రం వలసకార్మికుల చట్టాలను పకడ్బందీగా అమలు చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం శూన్యం.

జోరుగా వలసలు

అతిపెద్ద పారిశ్రామికవాడైన పటాన్‌చెరు ప్రాంతంలో పరిశ్రమలు, జోరుగా నిర్మాణాలు జరుగుతుండటంతో ఈ ప్రాంతాలకు వలస కార్మికులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కేవలం పటాన్‌చెరు, రామచంద్రాపురం పరిధిలోనే సుమారు 2లక్షలకు పైగా వలస కార్మికులుంటారని కార్మిక సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. బొల్లారం, కాజిపల్లి, పాశమైలారం, బొంతపల్లి, హత్నూర, కొండాపూర్‌, సదాశివపేట్‌ , జహీరాబాద్‌లతో పాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 4లక్షల మంది వలస కార్మికులు ఉండవచ్చని అంచనా.

వ్యాపారంగా మారిన కూలీల తరలింపు

కొంతమంది దీనిని వ్యాపారంగా మార్చివేశారు. ఉత్తర భారతదేశం నుంచి తక్కువ వేతనాలతో పనిచేసే కార్మికులతో ఒప్పందం చేసుకుని వారిని ఇక్కడ తీసుకొస్తున్నారు. వారితో పని చేయిస్తూ దళారులు సంస్థల వద్ద నుంచి డబ్బులు తీసుకుని వీరికి తక్కువ వేతనాలిస్తున్నారు. బహిరంగ రహస్యంగా ఉన్న ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినా ఈ దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

ఎలాంటి భద్రత లేకుండా

సుమారు 20 అంతస్తులపై

పని చేస్తున్న కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement