
పర్యాటక కేంద్రంగా పటాన్‌చెరు: గూడెం
పటాన్‌చెరు: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామ పరిధిలోని ఎంక చెరువులను రూ.10.78 కోట్లతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రెండు చెరువుల వద్ద సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు ముత్తంగి పరిధిలో ప్రజలకు ఆహ్లాద కేంద్రాలుగా ఉండేందుకు చెరువులను సుందరీకరణ చేపడుతున్నామని తెలిపారు. ప్రతీ చెరువుకట్టపై సెంట్రల్ లైటింగ్ సిస్టం, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు పార్క్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, హెచ్‌ఎండీఏ చెరువుల విభాగం డీఈ రామకృష్ణ పాల్గొన్నారు.
పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: పేదల కడుపు నింపేందుకే ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నాగల్‌గిద్ద మండలం దామర్‌గిద్ద గ్రామంలోని సోమ వారం దళిత కుటుంబంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారుడి ఇంట్లో కుటుంబ సభ్యుల తో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. లబ్ధిదారుడికి పంపిణీ అయిన బియ్యం నాణ్యత గూర్చి అడిగి తెలుసుకున్నారు. పేదల కష్టాలు తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పథకాలు చేపడుతుందని అన్నారు. అనంతరం ఖేడ్ మండలం రుద్రారం, పైడిపల్లి, పంచగామ తదితర గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేపట్టారు. ఖేడ్ బస్సుడిపో సమీపంలోని పద్మశాలికాలనీలో రూ.10 లక్షలతో సీసీరోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వినోద్‌పాటిల్, దారం శంకరన్, షెట్టి చంద్రశేఖర్, పంతంగి రమేశ్ కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు.
పాలిసెట్‌కు
దరఖాస్తులు ఆహ్వానం
సంగారెడ్డి టౌన్: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకి దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. www.poycet.sbtet.telangana. gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
‘స్పాట్’కు రాలేదని మెమోలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పదవ తరగతి స్పాట్ వ్యాల్యూషన్ కేంద్రంలో సోమవారం విధులకు హాజరు కానీ 180 మంది స్పెషల్ అసిస్టెంట్‌లకు మెమోలు జారీ చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. నేటి వరకు రిపోర్టు చేయని పక్షంలో అసిస్టెంట్‌లకు సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తామన్నారు.
హనుమాన్ జయంతికరపత్రం ఆవిష్కరణ
జహీరాబాద్‌టౌన్: జహీరాబాద్ పట్టణంలో ఈ నెల 12న నిర్వహించనున్న హనుమాన్ జయంతి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సోమవారం మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆవిష్కరించారు. జహీరాబాద్ పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. చిత్రంలో కార్పొరేటర్ మెట్టు కుమార్

పర్యాటక కేంద్రంగా పటాన్‌చెరు: గూడెం