
డ్రోన్‌లతో అదనపు ఆదాయం
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డిజోన్: మారుతున్న పోటీ ప్రపంచంలో మహిళా సభ్యులకు సాధికారత కల్పించేందుకు వ్యవసాయరంగంలో డ్రోన్‌ల వినియోగంతో మహిళలకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో నమో డ్రోన్ దీదీ, కిసాన్ డ్రోన్ ఆపరేటర్ శిక్షణపై హెటిరో, సింక్రో, ఫ్లయింగ్ వెడ్జ్, కంపెనీల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మహిళల శక్తికి సాంకేతికత కూడా తోడైతే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు డ్రోన్ శిక్షణను రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలోనే ప్రారంభించామని తెలిపారు. ఈ శిక్షణను క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ లేదా సీ్త్రనిధి ద్వారా మహిళలకు త్వరితగతిన రుణాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో జ్యోతి, అదనపు డీఆర్‌డీవో జంగారెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు హేటిరో హెడ్ సుధాకర్, సింక్రో సర్వీస్ విభాగాధిపతి నరసింహ, ఎయిరోస్పేస్ విభాగాధిపతి విజయ్ కుమార్ పాల్గొన్నారు.