
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కొల్చారం(నర్సాపూర్):ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ వార్డులో రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందితో ఆరా తీశారు. వై ద్యం కోసం వచ్చిన రోగులను పలకరించి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లో రోగులకు అసౌకర్యం కలిగించొద్దని సిబ్బందిని ఆదేశించారు. అక్కడి నుంచి అంశాన్ పల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ సెంటర్ను సందర్శించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, నర్సాపూర్ డివిజన్ వైద్యాధికారి సజన, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేశ్, ఎంపీహెచ్ఓ మదన్ మోహన్, సిబ్బంది ఉన్నారు.
రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్
కొల్చారం పీహెచ్సీ తనిఖీ