
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్‌రికార్డులో సిద్దిపేట చిన్నోడు
మద్దూరు(హుస్నాబాద్): ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో సిద్దిపేట జిల్లా దూల్మి ట్ట మండలం హనుమ తండాకు చెందిన అంతర్జాతీయ పర్వతారోహకుడు జాటోత్ విహాన్‌రామ్‌కు చోటు దక్కింది. ఈ విషయం తండ్రి తిరుపతినాయక్ తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఈ మేరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డును జాటోత్ విహాన్‌రామ్ అందుకున్నట్లు తిరుపతి తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని, హిమాచల్ ప్రదేశ్‌లోని పాతాల్ పర్వతాన్ని అధిరోహించినందుకు గాను అందించినట్లు తెలిపారు. తన కుమారుడిని ఈ స్థాయికి తీసుకొచ్చిన కోచ్ లెంకల మహిపాల్‌కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విహాన్ మంచిర్యాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
వారెవ్వా .. వైష్ణవి
● అంతర్జాతీయ బుక్ ఆఫ్
అవార్డ్స్‌లో దామరకుంట విద్యార్థిని
మర్కూక్(గజ్వేల్): అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్ వారు నిర్వహించిన పోటీల్లో మర్కూక్ మండలం దామరకుంట విద్యార్థిని లింగ వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. దామరకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వైష్ణవి ఆదివారం పంజాబ్‌లో నిర్వహించిన పోటీల్లో వైష్ణవి పాల్గొని భౌతిక రసాయన శాస్త్రంలో అత్యంత వేగంగా నిమిషం 59 సెంకడ్లలో ఆవర్తన పట్టిక క్రమ రూపం ఏర్పాటు చేసి బుక్ ఆఫ్ అవార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. సోమవారం ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ సీఈఓ పంకజ్ వేగ్ చేతుల మీదుగా ట్రోఫీ, బహుమతిని అందుకుందని మండల విధ్యాధికారి వెంకట్ రాములు తెలిపారు. వెంకట్‌రాములు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
సనాతన ధర్మాన్ని కాపాడాలి
పెద్దశంకరంపేట(మెదక్): సనాతన ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత అని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతిస్వామి, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు డాక్టర్ సీఎస్. రంగరాజన్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయ ఉత్సవాల్లో వారు పాల్గొని భక్తులకు ప్రవచనాలందించారు. ఆలయ నిర్మాణంలో ప్రతీ ఇంటి నుంచి కులమతాలకు అతీతంగా భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు.
గుర్తు తెలియని మహిళ మృతి
జహీరాబాద్: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన జహీరాబాద్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ (45) మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని వికారాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వివరించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సెల్ 84669 38351ను సంప్రదించాలని సూచించారు.
కులం పేరుతో దూషణ
● ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
మద్దూరు(హుస్నాబాద్) : కులం పేరుతో దూషించి వ్యక్తిపై దాడి చేసిన వారిపై సోమవారం ఎస్సీ ఎస్‌టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ షేక్ మహబూబ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ఖాతా గ్రామానికి చెందిన సోలిపురం బాబు శనివారం మిత్రులు సురేశ్, రాజుతో కలిసి ధూల్మిట్టలో వ్యవసాయ పనులకు కూలీ పనికి వెళ్లారు. తిరిగి వస్తూ బాబు, సురేశ్ వైన్స్ వద్ద గల పర్మిట్ రూంలో మద్యం తాగుతుండగా మహిపాల్‌రెడ్డి కులం పేరుతో బాబును దూషించాడు. కర్రతో దాడి చేయగా తలకు గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో కత్తితోపొడుచుకున్న వ్యక్తి
శివ్వంపేట(నర్సాపూర్) : మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన మండల పరిధి బోజ్య తండాలో చోటు చేసుకుంది. తండా వాసుల కథనం మేరకు.. తండాకు చెందిన గగూలోత్ విఠల్ మద్యం మత్తులో సోమవారం తండాలో జరిగిన తమ్ముడి కూతురు పెళ్లిలో హల్‌చల్ చేశాడు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులతో గొడవ పడి కత్తితో పొడుచుకున్నాడు. పేగులు బయటకు వచ్చి రక్తస్రావం అవుతున్నప్పటికీ గొడవ చేస్తూనే ఉన్నాడు. తండా వాసులు కత్తిని లాగేసుకొని చికిత్స నిమిత్తం పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్‌రికార్డులో సిద్దిపేట చిన్నోడు

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్‌రికార్డులో సిద్దిపేట చిన్నోడు