
రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి
హవేళిఘణాపూర్(మెదక్): చరిత్రలో నిలిచిపోయే విధంగా హవేళిఘణాపూర్ విద్యార్థులు పుస్తక రచన చేయడం అభినందనీయమని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు రచించిన ‘అమృత గుళికలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సృజనాత్మకత కలిగిన విద్యార్థులు భవిష్యత్‌లో ఏ రంగంలో ఉన్న సమాజ సేవ చేస్తారన్నారు. పుస్తకాలు చదవాల్సిన సమయంలో విజ్ఞానం పొంది పుస్తక రచనలు చేయడం సంతోషమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ స్వాతి, ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్యామల, రవీందర్, మహేశ్వరచారీ, అశోక్, ఎల్లమ్మ, రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డీఈఓ రాధాకిషన్