
కేతకీ ఆలయాభివృద్ధికి కృషి
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ హామీనిచ్చారు. నూతనంగా ఏర్పాటైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఆలయంలో నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయన గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ...ఆలయానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి పాటుపడతానన్నారు. అభివృద్ధి జరిగితేనే మరింతగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా పాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రావు పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప, నాయకులు శంకర్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామ్ లింగారెడ్డి, ఉదయ్ శంకర్ పాటిల్, రాకేష్ షెట్కార్, నరేష్‌గౌడ్, తన్వీర్, తదితరులు పాల్గొన్నారు.
చైర్మన్‌తో పాటు మండలి
సభ్యులు ప్రమాణ స్వీకారం
ఆలయ ఆవరణలో పాలకమండలి చైర్మన్‌గా ఈదులపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌తో పాటు సభ్యులుగా మల్లికార్జున్, నవాజ్ రెడ్డి, లక్ష్మయ్య, మల్లప్ప, శివకుమార్, శ్రీనివాస్, తిరుమలేశ్, మల్‌శెట్టి, లక్ష్మీ, విట్టల్‌రెడ్డి కోఆప్షన్ సభ్యుడిగా బసయ్య స్వామి ప్రమాణం చేశారు.
మతసామరస్యానికి ప్రతీక ఈద్ మిలాప్
జహీరాబాద్ టౌన్: మతసామరస్యానికి ఈద్ మిలాప్ ప్రతీకని జహీరాబాద్ ఎంపీ.సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్‌లో మాజీ సొసైటీ చైర్మన్ సయ్యద్ రియాజ్ సోమవారం నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో సురేశ్ షెట్కార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...రంజాన్ అనంతరం నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని కులాల మతాల పెద్దలు, ప్రజలు హాజరుకావడం అభినందనీయమన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ...కుల మతాలకతీతంగా ఈద్ మిలాప్ ద్వారా కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ తన్వీర్, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు రాంలింగారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్ పాల్గొన్నారు.
ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్
నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం