
పెళ్లి కుదరడంలేదని బలవన్మరణం
చేగుంట(తూప్రాన్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశివనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యరెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్(32)కు రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తల్లిదండ్రుల గొడవతో మనస్తాపం చెంది
పాపన్నపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న మండల పరిధిలోని నార్సి ంగిలో గురువారం వెలుగు చూసింది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మంగలి సత్తయ్య, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నరేశ్ కుమార్(26) పీజీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. కొద్దిరోజులుగా తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలతో మనస్తాపం చెందిన నరేశ్ కుమార్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.