తప్పిపోయిన బాలుడు తల్లి చెంతకు
పటాన్‌చెరు టౌన్: తప్పిపోయిన బాలుడిని రెండు గంటల్లోనే తల్లి వద్దకు చేర్చిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేష్ కథనం ప్రకారం.. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా కాలనీ శివాలయం రోడ్డుకు చెందిన హనుమంత్ కుమారుడు కృష్ణ (3) శుక్రవారం ఆడుకుంటూ తప్పిపోయాడు. ఒక దగ్గర ఏడ్చుకుంటూ కనిపించడంతో స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వివరాల కోసం ఆరాతీయగా.. బీరంగూడలోని శివాలయం రోడ్డుకు చెందిన హనుమంతు, సునంద దంపతుల కుమారుడు కృష్ణగా గుర్తించారు. బాలుడిని తల్లి సునందకు అప్పగించారు. దీంతో కానిస్టేబుళ్లు స్వప్న, మహేశ్వర్, జయరాజ్‌లకు ఆమెఓ కృతజ్ఞతలు తెలిపింది.
తప్పిపోయిన
శిశువు ఎక్కడ?
కొల్చారం/చిలప్‌చెడ్(నర్సాపూర్): తప్పిపోయిన ఆరు నెలల పసికందును అమ్మేశారా.. లేక చంపేశారా అన్న విషయం కొల్చారం, ఇటు చిలప్‌చెడ్ మండలాలలో చర్చనీయాంశంగా మారింది. చిలప్‌చెడ్ మండలం టోప్యా తండాకు చెందిన మహిళను కొల్చారం మండలం సీతారాంతండాకు చెందిన నునావత్ రాజుతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారికి నాలుగు నెలల పాప ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో జనవరి 20న రాజు ఇంటికి వచ్చే సరికి తల్లికూతుళ్లు కనిపించలేదు. ఈ , విషయాన్ని తన మామకు తెలియజేశాడు. జనవరి 28న కేసు నమోదు చేయడంతో తల్లిని తీసుకొచ్చారు. చిన్నారి గురించి తల్లిని విచారించగా, పొంతన లేని సమాధానాలు ఇస్తుందని పోలీసులు తెలిపారు. కాగా తన భార్య, కూతురు అదృశ్యమైన విషయమై తాను ముందుగానే కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, పోలీసులు తనను విచారణ చేసి కేసు నమోదు చేయలేదని, తన భార్య తండ్రి దీప్ల ఫిర్యాదును కేసుగా నమోదు చేయడం ఏమిటని రాజు అనుమానం వ్యక్తం చేశాడు.
యువకుడి ఆత్మహత్య
హవేళిఘణాపూర్ (మెదక్): ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. హవేళిఘణాపూర్‌కు చెందిన నరేశ్ (24) కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నరేశ్.. ఇంట్లో తలుపులు వేసుకొని దూలానికి ఉరి వేసుకున్నాడు. గమనించిన అతని కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
బైండోవర్
ఉల్లంఘనలో జరిమాన
అక్కన్నపేట(హుస్నాబాద్): బైండోవర్ ఉల్లంఘన కేసులో ఇద్దరికి జరిమానా విధించారు. ఈ సంఘటన అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. హుస్నాబాద్ ఎకై ్సజ్ శాఖ సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోతు భూలి, ఈర్య గతంలో గుడుంబా కేసులో తహసీల్థార్ ఎదుట బైండోవర్ అయ్యారు. ఇటీవల మళ్లీ గుడుంబా తయారీ చేస్తూ పట్టుబడటంతో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘన కింద తహసీల్దార్ అనంతరెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరికి రూ.50 వేల చొప్పన జరిమాన విధించారు.
యువకుడి అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటరెడ్డి కథనం ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మారావు కాలనీకి చెందిన వేణు ప్రసాద్ (21) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28న బయటకెళ్తున్నానని తన తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేసి చూడగా స్విచ్ ఆఫ్ ఉంది. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తప్పిపోయిన బాలుడు తల్లి చెంతకు


