
ఆత్మహత్య కాదు.. హత్య
● వృద్ధ దంపతుల మృతిపై వీడిన మిస్టరీ
● నిందితుల రిమాండ్
● వివరాలు వెల్లడించిన ఏసీపీ మధు
నంగునూరు(సిద్దిపేట): తాగుడు, చెడు అలవాట్లకు బానీసలుగా వారిన యువకులు నగల కోసం వృద్ధ దంపతులను ధారుణంగా కొట్టి చంపారు. మూడు రోజుల కిందట నంగునూరులో జరిగిన వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతిపై సిద్దిపేట ఏసీపీ మధు ఆదివారం వివరాలు వెల్లడించారు. నంగునూరు మండల బద్దిపడగకు చెందిన పసుపుల సంపత్, మాలోతు రాజు, మాలోతు శ్రీకాంత్ ముగ్గురు తాగుడుకు అలవాటు పడి జల్సాగా తిరుగుతున్నారు. నంగునూరుకు చెందిన పర్షరాములు వ్యవసాయ బావి వద్ద ఉన్న పౌల్ట్రీఫౌమ్‌లో పనులకు వెళ్లారు. పర్షరాములు తండ్రి ఆవుల కొమురయ్య, తల్లి భూదవ్వ పౌల్ట్రీఫామ్ వద నివాసం ఉంటున్నారని తెలుసుకొని వారి వద్ద ఉన్న నగలును దొంగిలించాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వృద్ధులు పడుకున్న ఇంటి కిటికీలను తొలగించి లొనికి వెళ్లారు. అలికిడికి వృద్ధులు లేవడంతో గొంతు పిసికి, సిమెంట్ ఇటుకతో బాది హత్య చేశారు. అనంతరం భూదవ్వపై ఉన్న మాటీలు, కమ్మలు, వెండి మొలతాడు దొంగిలించి కిటికిని ఎప్పటిలాగే పెట్టి పారిపోయారు. కేసు దర్యాప్తు చేసిన సిద్దిపేట రూరల్‌సీఐ శ్రీను, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ అసిఫ్ నిందితులను మూడు రోజుల్లో పట్టుకొని వారి వద్ద నుంచి రెండు బైకులు, మూడు సెల్‌ఫోన్లు, వెండి మొలతాడు, రూ.30,800 స్వాధీనం చేసుకొని నిదుతులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.