వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
శనివారం వేర్వేరు చోట్ల మహిళ, యువకుడు, వృద్ధురాలు అదృశ్యమయ్యారు.దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్తతో గొడవ పడి భార్య
సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి మహిళ అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన కుమ్మరి నారాయణ, సుగుణమ్మ(40) దంపతులు. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. 20 రోజుల కిందట దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన మహిళ గత నెల 31న ఇంటి నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పని ఉందని వెళ్లి యువకుడు
గజ్వేల్‌రూరల్: పని ఉందని బయటకి వెళ్లి యువకుడు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్‌లో చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాడ మల్లారెడ్డి(28) 4న హైదరాబాద్‌లో పని ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బైక్‌పై వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తెలిసిన చోట, బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. శనివారం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.


