
ఇక సన్న బువ్వ
నేటి నుంచి బియ్యం పంపిణీ
● సర్వం సిద్ధం చేసిన అధికారులు ● ఉమ్మడి జిల్లాలో28లక్షల మందికిపైగా లబ్ధి
ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలు
సన్న బియ్యం వచ్చేశాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు చేరుకున్నాయి. మంగళవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హుస్నాబాద్‌లో 8వ రేషన్ షాపులో పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించనున్నారు.
సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,83,883 రేషన్ కార్డులున్నాయి. ఇందుకు నెలకు 18,205.019 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. 28,50,964 మందికి లబ్ధిచేకూరనుంది. ఇందులో 8,25,324 ఆహార భద్రత కార్డులకు 26,93,609 సభ్యులకు ఒక్కరికి 6కిలోలు, 58,311 అంత్యోదయ కార్డులకు గాను ఒక్కో కార్డుకు 35 కిలోలు, 248 అన్నపూర్ణ కార్డులకు ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యంను పంపిణీ చేస్తారు.
ఇక అక్రమాలకు చెక్
బయటి మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు ఆకాశానంటుతున్నాయి. మధ్య తరగతి, సామాన్యులు కొనలేని పరిస్థితి. ఇది వరకు రేషన్ షాప్‌ల్లో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని 80శాతం మంది లబ్ధిదారులు అమ్మి సన్న బియ్యం కొనుగోలు చేసే వారు. దీంతో రేషన్ బియ్యం పక్క దారి పట్టేది. తాము అధికారంలోకి వస్తే సన్న బి య్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కొలువుదీరిన ఏడాదిన్నరకు సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది.
జిల్లాలోని ఉపాధి హామీ వివరాలు
గ్రామ పంచాయతీలు 619
జాబ్ కార్డులు 2.19లక్షలు
ఉపాధి కూలీలు 4.3లక్షలు
యాక్టిబ్ జాబ్ కార్డులు 1.32లక్షలు
రోజూ హాజరవుతున్న
కూలీలు (సుమారుగా)
35,000
జిలా అంత్యోదయ ఆహార భద్రత అన్నపూర్ణ మొత్తం బియ్యం(టన్నులు)
సిద్దిపేట 18,336 2,72,909 82 2,91,327 5,775.742
మెదక్ 13,860 1,99,902 66 2,13,828 4,430.496
సంగారెడ్డి 26,115 3,52,513 100 3,78,728 7,998.781
అన్ని ఏర్పాట్లు చేశాం
రేషన్ షాపుల ద్వారా కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే దాదాపు అన్ని రేషన్ షాపులకు బియ్యం చేరుకున్నాయి. ప్రతి నెలా 1 నుంచి 18వ తేదీ వరకు పంపిణీ జరగనుంది. లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– తనూజ, డీఎస్‌ఓ, సిద్దిపేట

ఇక సన్న బువ్వ

ఇక సన్న బువ్వ

ఇక సన్న బువ్వ