
సేడెగుట్టతండాలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు
కోహీర్(జహీరాబాద్): సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన మండలంలోని సేడెగుట్ట తండా, సిద్దాపూర్ తండా, గొడిగార్‌పల్లి, పర్సపల్లి, బడంపేట, ఖానాపూర్, కొత్తూర్(కె) గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు రైతుబంధు, పింఛన్ల పెంపు, రూ.400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ రూ.15లక్షలకు పెంపు, అన్నపూర్ణ పథకంలో సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. మాట తప్పని కేసీఆర్ తప్పకుండా ఆ హామీలను నేరవేరుస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను నమ్మొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జి దేవిప్రసాద్, టీఎస్‌ఐడీసీ చైరన్ మహ్మద్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, నర్సింలు యాదవ్, స్రవంతిరెడ్డి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మొద్దు
ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు
Comments
Please login to add a commentAdd a comment