ప్రధాన రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి | - | Sakshi
Sakshi News home page

ప్రధాన రోడ్లన్నీ గులాబీమయంగా మారాయ

Published Wed, Oct 18 2023 4:40 AM | Last Updated on Wed, Oct 18 2023 12:15 PM

ప్రజా ఆశీర్వాద సభకు తరలివస్తున్న ప్రజలు - Sakshi

ప్రజా ఆశీర్వాద సభకు తరలివస్తున్న ప్రజలు

● ప్రధాన రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి.

● జై తెలంగాణ.. జై కేసీఆర్‌.. జై హరీశ్‌రావు అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

● రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం నాయకులు జలపందిరితో సభా స్థలికి చేరుకున్నారు.

● మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రజలను లోనికి అనుమతించారు.

● సాయంత్రం 5.45కు సీఎం హెలికాప్టర్‌లో ప్రజా ఆశీర్వాద సభకు చేరుకున్నారు.

●హెలికాప్టర్‌ దిగిన కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌ రావు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకగా, జెడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల, మార్కెట్‌ కమిటీ పర్సన్‌ విజిత తిలకం దిద్ది, మంగళహారతులతో స్వాగతం పలికారు.

● సీఎం ప్రసంగం అనంతరం కేసీఆర్‌కు

మంత్రి హరీశ్‌రావు వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందించి, పాదాభివందనం చేశారు.

● 6.34 గంటలకు సభను ముగించుకుని సీఎం సభా ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గంగుండా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

● ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సభలో నాగలి చూపిస్తున్న రైతు 1
1/1

సభలో నాగలి చూపిస్తున్న రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement