
పోటీలను ప్రారంభిస్తున్న నవీన్ మిట్టల్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేటఎడ్యుకేషన్: క్రీడలు విద్యార్థుల జీవితాల్లో అంతర్భాగం కావాలని, చదువుతోపాటు క్రీడల్లో ముందుంటే శారీరక, మానసిక దృఢత్వం ఉంటుందని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమినర్, భూపరిపాలన, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ నవీన్‌మిట్టల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్ –19 (ఎస్‌జీఎఫ్) జూనియర్ కళాశాలల ఫెడరేషన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని, గెలిచిన వారిని చూసి అసూయ పడకుండా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ మాట్లాడుతూ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని స్విమ్మింగ్ ఫూల్ ను వినియోగించుకొని మెళకువలు నేర్చుకోవా లన్నారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్(టీజీఎల్‌ఏ)రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం మాట్లాడుతూ.. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నుంచి అండర్ –19 క్రీడలను ఇంటర్ విద్యార్థులతో నిర్వహించిన ఘనత సిద్దిపేటకే దక్కిందన్నారు. అలాగే, జిల్లా ఇంటర్ విద్యాధికారి, అండర్ –19 క్రీడల చైర్మన్ సూర్యప్రకాశ్, కార్యదర్శి సమ్మయ్య, డీవైఎస్‌ఓ నాగేందర్, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూచంగారి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సత్యనారాయణరెడ్డి, శారద, సురేష్‌రెడ్డి, భూపాల్‌రాజు, బు చ్చిరెడ్డి, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ రెఫరీ బోర్డు కన్వీనర్ రవీందర్‌రెడ్డి, క్రీడా పోటీల ఇన్‌చార్జి వెంకటేశ్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment