
22 యేళ్లుగా పోరాటం
పటాన్చెరు (వట్టినాగులపల్లి) నుంచి మెదక్ వరకు 90 కిలో మీటర్ల రైల్వే లైన్ కోసం 22 యేళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఈ లైన్‌కు కోసం రైల్వే మంత్రులకు వినతి పత్రాలు అందజేశాం. 2018లో రైల్వే అధికారులు స్పందించి సర్వే చేసి రూ.1700 కోట్లు అవసరమని అంచనాలు సైతం సిద్ధం చేశారు. కానీ బడ్జెట్‌లో నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదు. ఈ సారైనా నిధులు కేటాయించాలని కోరుతున్నాం.
– గంగ జోగినాథ్, జోగిపేట్
ఆదాయ పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి
ప్రస్తుతం ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు మాత్రమే ఆదాయ పరిమితి ఉంది. దీనిని రూ.10 లక్షల వరకు పెంచాలి. అలాగే స్లాబ్‌రేట్లను సవరించాలి. 80(సీ) పన్ను మినహాయింపు రూ.2.50 లక్షలు ఉంది. రూ.5 లక్షల వరకు పెంచాలి. గృహ రుణ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు పెంచాలి. – వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీపీటీఎఫ్
